సాధారణ పరిస్థితులు ఏర్పడిన నాలుగు వారాల తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: సాధారణ పరిస్థితులు ఏర్పడిన నాలుగు వారాల తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి ప్రకటించారు.
పలు ప్రవేశ పరీక్షల నిర్వహహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం నాడు సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల నిర్వహణపై చర్చించారు.
undefined
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఉన్నత విద్యామండలి తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించడం కూడ సాధ్యం కాదని ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి తేల్చి చెప్పారు.
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: ఒక్కరోజులోనే 1.25 లక్షల వాహనాలు సీజ్
లాక్ డౌన్ ఎత్తివేసిన నాలుగు వారాల తర్వాతే పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉన్న ప్రవేశపరీక్షలను డిట్రీ పరీక్షల తర్వాతే నిర్వహిస్తామన్నారు. ఎంసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షలను ముందుగా నిర్వహిస్తామని తెలిపారు.
డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్ధులకు పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల విషయంలో కేబినెట్ సబ్ కమిటి నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటామని పాపిరెడ్డి చెప్పారు.