కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ

Published : Jun 08, 2022, 05:11 PM IST
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ

సారాంశం

కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వ‌ర్ రావు, సురేశ్ రెడ్డి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐటీ, నైపుణ్యాభివృద్దికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన తెలంగాణ మంత్రి ఈ భేటీ సహృదయపూర్వకమైన వాతావరణంలో సాగిందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతీయ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అవ‌కాశాల‌పై కేంద్ర మంత్రితో చర్చించినట్టుగా కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త‌ల‌కు అనుకూల‌మైన ఎకోసిస్ట‌మ్‌ను సృష్టించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్