హైదరాబాద్‌లో చిచ్చు పెట్టే యత్నం: కేటీఆర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 24, 2020, 5:08 PM IST
Highlights

అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యర్ధుల విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యర్ధుల విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌కు మద్ధతు పలుకుతూ కొన్ని సంఘాల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. ప్రశాంతంగా వున్న హైదరాబాద్‌లో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు 85 సీట్లు ఇచ్చిన వ్యక్తి కేసీఆరే అన్నారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని గతంలో కేంద్రమంత్రిగా వున్నప్పుడు కేసీఆర్ మన్మోహన్ సింగ్‌ను కోరారని కేటీఆర్ గుర్తుచేశారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధను పరిపుష్టం చేస్తామని చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు.

Also Read:పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్: బండి సంజయ్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

అంతకుముందు మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని.. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి బీసీలకు ఉన్నత విద్యనందిస్తున్నట్లు ఈటల తెలిపారు. రాష్ట్రంలో 800 పైగా రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

ఒక్కో విద్యార్థిపై రూ.1.15 లక్షలు ఖర్చుపెడుతూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని, పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటల పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలని రాజేందర్ వెల్లడించారు. 

click me!