కంటెంట్ ఉన్న లీడర్ సక్సెస్ అవుతాడు: కేటీఆర్

కంటెంట్  ఉన్న సినిమా  సక్సెస్  అయినట్టే కంటెంట్  ఉన్న  లీడర్ కూడా  విజయవంతమౌతాడన్నారు.


హైదరాబాద్:కంటెంట్  ఉన్న సినిమా  సక్సెస్ అవుతుందని  తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.  కంటెంట్  ఉన్న లీడర్  కూడా  హిట్ అవుతాడని  ఆయన  అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు హైద్రాబాద్ లో  కథా రచన  పుస్తకావిష్కరణలో  మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తాము కూడా  పాన్ ఇండియాకు వెళ్తున్నామన్నారు.  జాతీయ పార్టీ ఏర్పాటు  విషయమై తనను కొందరు  ప్రశ్నించిన సమయంలో  కంటెంట్  ఉన్న తెలుగు నాయకుడు  ఎందుకు  హిట్ కాడని  ఆయన ప్రశ్నించారు.  కంటెంట్  ఉన్న సినిమాలు  పాన్ ఇండియాలో  సక్సెస్ అవుతున్నాయని కదా అని ఆయన ప్రశ్నించారు.

అలానే  కంటెంట్  ఉన్న కేసీఆర్  కూడా  జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అవుతారని  కేటీఆర్ చెప్పారు. అసాధ్యం అనుకున్న అంశాలను తమ పార్టీ  ఎనిమిదేళ్లలో  సుసాధ్యం చేసిందన్నారు.  రాష్ట్రంలో  చేసినట్టుగానే  దేశంలో  కూడా  తాము పథకాలను అమలు చేస్తామని  కేటీఆర్ ప్రకటించారు. దేశంలో  తెలుగు సినిమాల వైపే అంతా చూస్తున్నారన్నారు. పాన్ ఇండియాలో  తెలుగు సినిమాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయని ఆయన చెప్పారు. కరోనా సమయంలో  కేసీఆర్  ప్రసంగిస్తుంటే  టీవీలకు ప్రజలు అతుక్కుపోయేవారని  కేటీఆర్ గుర్తు చేశారు.  

Latest Videos

click me!