తీరనున్న ట్రాఫిక్ కష్టాలు:కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన తెలంగాణ మంత్రి కేటీఆర్

By narsimha lode  |  First Published Jan 1, 2023, 12:33 PM IST

హైద్రాబాద్ లో  కొత్తగూడ ఫ్లైఓవర్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్  ఇవాళ ప్రారంభించారు.  సుమారు 3 కి.మీ దూరం పాటు  ఈ ఫ్లైఓవర్ ను  263 కోట్ల వ్యయంతో నిర్మించారు.  
 


హైదరాబాద్: నగరంలోని కొత్తగూడ వద్ద ఫ్లైఓవర్ ను ఆదివారం నాడు  తెలంగాణ మంత్రి కేటీఆర్  ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల దూరం ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు.  కొత్త సంవత్సరం రోజున ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. రూ. 263 కోట్లతో  ఈ ఫ్లైఓవర్ ను  నిర్మించారు. కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంత వాసులకు  కొత్తగూడ ఫ్లైఓవర్ తో  ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.  బొటానికల్ గార్గెన్,  కొత్తగూడ ,కొండాపూర్ జంక్షన్ లను కలిపేలా కొత్తగూడ ఫ్లైఓవర్ ను  నిర్మించారు. గచ్చిబౌలి నుండి మియాపూర్‌ కు,,ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి హైటెక్‌ సిటీకి  ఈ ఫ్లైఓవర్ ద్వారా  సులభంగా  చేరుకొనే వెసులుబాటు దక్కనుంది.  ఈ ఫ్లైఓవర్ కు అనుబంధంగా అండర్ పాస్ ను నిర్మించారు. 

మజీద్ బండ రోడ్డు నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 401మీటర్ల ర్యాంపు, కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వైపు 383 మీటర్ల ర్యాంపు నిర్మించారు.. కొత్తగూడ జంక్షన్ వద్ద మూడు లైన్లతో నిర్మిస్తున్న అండర్ పాస్  470 మీటర్ల పొడవున ఉంది. దీంతో హఫీజ్ పేట్ నుంచి గచ్చిబౌలి వెళ్లే ట్రాఫిక్ సునాయాసంగా ముందుకు కదులుతుంది. ఈ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో రావడంతో బొటానికల్ గార్డెన్ జంక్షన్ , కొత్తగూడ జంక్షన్ వద్ద  ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.  దీంతోపాటు కొండాపూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ దాదాపుగా  తగ్గే అవకాశం ఉంది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వరకు విస్తరించి ఉన్న అనేక ఐటి ,ఇతర సంస్థలలోని ఉద్యోగులకు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం  ఎస్ఆర్‌డీపీ కింద  34 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇంకా  14 ప్రాజెక్టులను పూర్తి చేయనుంది.  కొత్తగూడ ఫ్లై ఓవర్ ను కూడా ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద నిర్మించారు. 

Latest Videos

హైద్రాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.  అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తుంది.అంతేకాదు  మెట్రో రైల్వే స్టేషన్  రెండో దశ పనులను  కూడా గత ఏడాది డిసెంబర్  9వ తేదీన  తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.  . ఈ మార్గం  పూర్తైతే  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు   మెట్రో రైలు  అందుబాటులోకి రానుంది. నగరంలోని  ఇతర ప్రాంతాల్లో  కూడ  మెట్రో రైలు మార్గం విస్తరణతో పాటు  ఫ్లై ఓవర్ల నిర్మాణానికి  ప్రభుత్వం  చర్యలు తీసుకొంటుంది. మరో వైపు స్కైవేలను కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది.  
 

click me!