తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం రక్తదానం చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్న మంత్రి.. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు వెల్లడించారు
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం రక్తదానం చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్న మంత్రి.. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు వెల్లడించారు.
అలాగే స్థానిక ఆసుపత్రుల్లో రక్తదానం చేసి వారికి నిలవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలు ఇళ్లపైనే పార్టీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.
undefined
Also Read:వేడుకలు జరుపుకోండి.. కానీ లాక్‌డౌన్ నిబంధనలు పాటించండి: టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తికానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసిన ఆయన... ప్రధాన లక్ష్యమైన రాష్ట్ర సాధనతో పాటు సాధించుకున్న రాష్ట్రంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను టీఆర్ఎస్ సాధించిందని కేసీఆర్ అన్నారు.
సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో తెలంగాణ గొప్ప విజయాలు నమోదు చేసిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎంతో గర్వకారణమని కేసీఆర్ అన్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు గడిచిన సందర్భంగా ఎంతో ఘనంగా జరుపువాల్సిన వేడుకలను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని కేసీఆర్ తెలిపారు. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
Also Read:తెలంగాణలో తగ్గిన కరోనా... ఇవాళ కేవలం ఏడుగురికి మాత్రమే పాజిటివ్
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
కరోనా నేపథ్యంలో ఖచ్చితంగా లాక్‌డౌన్ నిబంధనలు, ప్రభుత్వం సూచించిన ఇతర మార్గదర్శకాలను పాటించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
On the eve of tomorrow, donated blood to help the Thalassemia patients & others in medical emergencies
Also appealed to all leaders & workers to work with local area hospitals & aid them by donating blood
pic.twitter.com/EAJgt2K8WJ