మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

By narsimha lodeFirst Published Oct 19, 2020, 7:17 PM IST
Highlights

మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు పరామర్శించారు. సెప్టెంబర్ 30వ తేదీన మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.


హైదరాబాద్: మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు పరామర్శించారు. సెప్టెంబర్ 30వ తేదీన మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని ఆరోగ్య పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకొన్నారు.  నర్సింహారెడ్డి ఆరోగ్యం గురించి డాక్టర్లను వాకబు చేశారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి కేటీఆర్ డాక్టర్లను కోరారు. 

ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకొంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న సమయంలోనే ఆయన కరోనా నుండి కోలుకొన్నారు. అయితే ఇదే సమయంలో ఆయనకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఏర్పడింది. అపోలో వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకొంటున్నారు. 

కరోనా సోకడానికి ముందుగానే నాయిని నర్సింహ్మారెడ్డికి  గుండె ఆపరేషన్ చేసుకొన్నాడు. గుండె ఆపరేషన్ తర్వాత ఆయన కరోనా బారినపడ్డారు. నాయిని నర్సింహ్మారెడ్డి సతీమణి, పెద్ద కొడుకు, అల్లుడికి కూడ కరోనా సోకిందని సమాచారం. నాయిని సతీమణిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

click me!