మూసీకి వరదలు: కుంగిన పురానాపూల్ వంతెన

By narsimha lodeFirst Published Oct 19, 2020, 4:30 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీపై నిర్మించిన పురానాపూల్ వంతెన దెబ్బతింది.
 


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీపై నిర్మించిన పురానాపూల్ వంతెన దెబ్బతింది.

400 ఏళ్ల క్రితం మూసీ నదిపై నిర్మించిన పురానాపూల్ బ్రిడ్జి పిల్లర్ పై పగుళ్లు ఏర్పడ్డాయి. అంతేకాదు బ్రిడ్జి కొంత మేర కుంగిపోయింది. దీంతో అధికారులు ఈ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు.

బ్రిడ్జి పటుత్వాన్ని పరిశీలించిన తర్వాత వాహనాల రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

also read:వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 10 వేలు: కేసీఆర్

నగరంలో కుతుబ్‌షాహీలు నిర్మించిన  కట్టడాల్లో పురానాపూల్ బ్రిడ్జి కూడ ఒకటి. గోల్కోండ కోట నుండి కార్వాన్ వెళ్లేందుకు గాను 1578 లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా దీనిని నిర్మించారు. 

1820లో మూసీకి వచ్చిన వరదలకు ఈ బ్రిడ్జి దెబ్బతింది. దీంతో అప్పటి నవాబ్ సికిందర్ షా మరమ్మత్తులు చేయించాడు.ఆ తర్వాత 1908 మూసీ వరదల తర్వాత కొద్ది బాగాన్ని మరమత్తు చేశారు.  మరో వందేళ్ల తర్వాత మూసీకి మరోసారి బారీ వరదలు రావడంతో మరోసారి బ్రిడ్జి కుంగిపోయింది.

click me!