నీ భార్యతో హెయిర్ కట్ చేయించుకో: నెటిజన్‌కు కేటీఆర్ సలహా... అన్నకు కవిత పంచ్

Siva Kodati |  
Published : Apr 17, 2020, 03:53 PM IST
నీ భార్యతో హెయిర్ కట్ చేయించుకో: నెటిజన్‌కు కేటీఆర్ సలహా... అన్నకు కవిత పంచ్

సారాంశం

కేటీఆర్ ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ ఆన్సర్‌పై స్పందించిన కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత మరో ఆసక్తి రేపే ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత సైతం రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. మంచి వాగ్థాటి, నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్ఞానం వీరిద్దరి సొంతం.

సోషల్ మీడియాలో వీరిద్దరూ యాక్టివ్‌గా ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో కేటీఆర్ ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ ఆన్సర్‌పై స్పందించిన కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత మరో ఆసక్తి రేపే ట్వీట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత అయినా హెయిర్ కటింగ్ సెలూన్‌లు తెరిచే సూచనలు ఉన్నాయా..? లేదంటే తన భార్యే హెయిర్ కట్ చేస్తానని అంటోందని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.

‘‘ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మే హెయిట్ కట్ చేసింది. అలాంటప్పుడు నువ్వెందుకు చేయించుకోవు..? అని సమాధానం ఇచ్చారు. దీనిని చూసిన కవిత... మరింత ఇంట్రెస్టింగ్‌గా స్పందించారు. ‘‘అన్నయ్యా... బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా..? అని ట్వీట్ చేశారు. కొద్ది క్షణాల్లోనే ఈ సంభాషణ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu