సింగరేణిపై మోడీవన్నీ అబద్దాలే:తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్

By narsimha lode  |  First Published Nov 14, 2022, 5:10 PM IST

సింగరేణి విషయంలో ప్రధాని మోడీ అబద్దాలుమాట్లాడారని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కేసీఆర్ వైఖరి కారణంగానే సింగరేణి  ప్రైవేటీకరణ విషయంలో మోడీ తలొగ్గారని మంత్రి చెప్పారు.


హైదరాబాద్:రామగుండంలో ప్రధాని మోడీ అబద్దాలు మాట్లాడారని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.  ప్రధానమంత్రి పదవిలో ఉన్న మోడీ అబద్దాలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. సోమవారంనాడు  ఆయన  హైద్రాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనససభ పక్ష కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడారు..సింగరేణి ప్రైవేటీకరణ విషయం లో మోడీ సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.రామగుండానికి ప్రధానమంత్రి  రావడానికి ముందే సింగరేణి కార్మికులు ప్రైవేటీకరణ యత్నాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేసీఆర్  గట్టిగా నిలబడినట్టుగా చెప్పారు.

 సీఎం కేసీఆర్ కృషికి ,కార్మికుల ఆందోళనలకు  మోడీ తలొగ్గారన్నారు.విశాఖలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై మోడీ ఒక్కమాట మాట్లాడలేదన్నారు. సింగరేణి సంస్థ కు అనేక సామాజిక భాద్యతలు ఉన్నాయని మంత్రి చెప్పారు.తమ వాటా తక్కువ ఉన్నందుకే సింగరేణి ని ప్రైవేటీకరణ చేయడం లేదన్నట్టుగా మోడీ మాట్లాడారన్నారు.

Latest Videos

పార్లమెంట్ లో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇచ్చిన సమాధానానికి మోడీ ప్రకటనకు వ్యత్యాసం ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. .బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ కు యత్నించి కేంద్రం భంగ పడ్డది నిజం కాదా  అని మంత్రి ప్రశ్నించారు. బొగ్గు గనులను  ప్రైవేటీకరణ చేయడం అంటే సింగరేణి సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతి లో పెట్టడమేనన్నారు.సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.సింగరేణి కార్మికులను ఆదాయ పన్ను నుండి   మినహాయించాలని శాసన సభ తీర్మానం చేసి పంపినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం అంటే రిజర్వేషన్ల హక్కును హరించడమేనని మంత్రి అభిప్రాయపడ్డారు సింగరేణి ప్రైవేటీకరణ పై మోడీ ప్రకటన టీ ఆర్ ఎస్ విజయంగా ఆయన పేర్కొన్నారు.
ఏపీ లో దిక్కులేనందునే  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పై కేంద్రం వైఖరి మారడం లేదన్నారు..

also read:సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే.. మేం ఎలా ప్రైవేటీకరణ చేస్తాం : మోడీ

రామగుండంలో ప్రధాని మోడీ  కార్యక్రమం లో స్థానిక ఎంపీ నైన తనను  పిలవకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని  పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత చెప్పారు..స్థానిక ఎంపీ కాకున్నా బండి సంజయ్ ను కార్యక్రమానికి  ఎందుకు పిలిచారని ఆయన  ప్రశ్నించారు..ఈ వ్యవహారాన్ని లోక్ సభ ప్రివిలేజీ కమిటీ కి పిర్యాదు చేస్తానన్నారు. రామగుండం కార్యక్రమం బీజేపీ సభలా సాగిందన్నారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్  విప్ ఎం. ఎస్. ప్రభాకర్,ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు.
 

click me!