మా ఎమ్మెల్యేలు దొంగలను పట్టుకున్నారు: రోహిత్ రెడ్డి,రామచంద్రభారతి ఆడియోపై మంత్రి జగదీష్ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 28, 2022, 2:46 PM IST

మునుగోడు ఉప ఎన్నికతోనే బీజేపీ పతనం ప్రారంభమైందని  తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్  రెడ్డి  చెప్పారు. తమ  ప్రభుత్వాన్ని కూలుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్  షా  చేసిన వ్యాఖ్యలను  ఆయన గుర్తు చేశారు


మునుగోడు:మునుగోడు ఉప  ఎన్నికతోనే బీజేపీ పతనం  ప్రారంభమైందని తెలంగాణ  విద్యుత్ శాఖ మంత్రి జగదీష్  రెడ్డి  చెప్పారు.రామచంద్రభారతి, ఎమ్మెల్యే పైలెట్  రోహిత్  రెడ్డి మధ్య  ఆడియో సంభాషణ మీడియాలో ప్రసారమైన తర్వాత  జగదీష్ రెడ్డి స్పందించారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ తో జగదీష్ రెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ బొక్కబోర్లాపడ్డారన్నారు.బీజేపీ కుట్రను తమ  పార్టీ ఎమ్మెల్యేలు బయటపెట్టారని ఆయన చెప్పారు.స్వాములను బీజేపీ నమ్ముకుందన్నారు.దొంగలను పట్టుకోవడంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారని ఆయన చెప్పారు.ఇప్పుడు అమిత్ షా వచ్చి  యాదాద్రిలో ప్రమాణం చేస్తారా అని  ఆయన ప్రశ్నించారు.

also read:ఎవరెవరు వస్తారో చెప్పండి:పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి ఆడియో సంభాషణ

Latest Videos

undefined

మొయినాబాద్  ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కు జరిగిన ప్రలోభాల అంశంపై   వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. బీజేపీ నేతలు ప్రజల ముందు దోషులుగా  నిలబడ్డారని ఆయన  చెప్పారు.ఎమ్మెల్యేల  ప్రలోభాల అంశంపై  చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. నెకల  రోజుల్లో టీఆర్ఎస్ సర్కార్  ను కూలగొడుతామని  కేంద్ర మంత్రి  అమిత్  షా చేసిన వ్యాఖ్యలను  జగదీష్ రెడ్డి  ఈ సందర్భంగా గుర్తు  చేశారు. 

మొయినాబాద్ ఫాం హౌస్  లో టీఆర్ఎస్ కు  చెందిన నలుగురు  ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి  చేశారనే  ముగ్గురిపై తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదు  మేరకు  ఈ నెల 26న రాత్రి ముగ్గురిని పోలీసులు అరెస్ట్  చేశారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజీ, హైద్రాబాద్ కు  చెందిన నందులను పోలీసులు  అరెస్ట్  చేశారు.

ఈ నెల  27 న ఈ  ముగ్గురిని  పోలీసులు  సరూర్  నగర్ లో  ఉన్న  జడ్జి  నివాసంలో హాజరుపర్చారు.  అయితే  ఈ ముగ్గురిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని జడ్జి  తప్పు బట్టారు.పీడీ  యాక్ట్ వర్తించదని  జడ్జి తేల్చి  చెప్పారు. 41  సీఆర్‌పీసీ సెక్షన్ కింద  నోటీసులు ఇచ్చి విచారించాలని జడ్జి ఆదేశించారు.అరెస్ట్ ను కూడ  జడ్జి  తిరస్కరించారు.నలుగురు ఎమ్మెల్యేలను తాము ప్రలోభాలకు గురి  చేశామనే ఆరోపణలను  బీజేపీ ఖండించింది. నలుగురు  ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ  తేల్చి చెప్పింది. అయితే రామచంద్రభారతి, పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య  ఆడియో సంభాషణకు సంబంధించి  బీజేపీ నేతలు ఎలా  స్పందిస్తారో చూడాలి.


 

click me!