కొండాపూర్ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి హరీష్ రావు.. డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు..

Published : May 23, 2022, 12:32 PM ISTUpdated : May 23, 2022, 12:41 PM IST
కొండాపూర్ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి హరీష్ రావు.. డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు..

సారాంశం

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే లంచం డిమాండ్ చేస్తున్న ఓ వైద్యుడి నిర్వాకం వెలుగు చూసింది. 

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే లంచం డిమాండ్ చేస్తున్న ఓ వైద్యుడి నిర్వాకం వెలుగు చూసింది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల ఫిర్యాదు చేశారు. దీంతో వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. ఆ డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పలు వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గైనకాలజి వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని చెప్పారు. ఆస్పత్రికి అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించిన మంత్రి హరీష్ రావు..  60శాతం పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ డెలివరీలను ఇంకా పెంచాలని సూచించారు. 

 

 

ఇంకా మంత్రి హరీష్ రావు ఆస్పత్రిలోని వార్డులో తిరుగుతూ... వైద్య సేవలు ఎలా అందుతున్నాయి..?, సదుపాయాలు ఎలా ఉన్నాయి..? అనే వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు
VB-G RAM G : కూలీలకు నిరుద్యోగ భృతి.. అందకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి