రైతుబంధు డబ్బుల్ని నిలిపివేస్తున్న బ్యాంకులు: మంత్రి హరీశ్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Jun 22, 2021, 6:26 PM IST
Highlights

రైతు బంధు డబ్బులు రైతులకు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పాత బకాయిలకు బ్యాంకులు సర్దుబాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు బంధు నిధులు నిలిపివేసినందుకు ఆదేశాలు లేవని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. 

రైతు బంధు డబ్బులు రైతులకు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పాత బకాయిలకు బ్యాంకులు సర్దుబాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు బంధు నిధులు నిలిపివేసినందుకు ఆదేశాలు లేవని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే నిలిపివేసి వుంటే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకులను హరీశ్ రావు కోరారు. రైతుల సమస్యలపై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు రెండు టోల్‌ఫ్రీ నెంబర్లను ప్రకటించారు హరీశ్ రావు. 

Also Read:రైతులకు తపాలా శాఖ శుభవార్త.. ఇకపై పోస్టాఫీసుల్లోనూ రైతు బంధు, ఇలా చేస్తే చాలు

కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 59.70 లక్షల మంది రైతులకు రైతుబంధు అందింది. ఆయా రైతుల ఖాతాల్లో రూ.6,663.79 కోట్లు జమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వానాకాలం సీజన్‌లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులకు రైతుబంధు వర్తిస్తుండగా.. 66,311 ఎకరాల భూమి అదనంగా సాగవుతుంది. ఈ నెల 15న నుంచి ప్రారంభమైన రైతు బంధు పంట సాయం.. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది 
 

click me!