రాజకీయాల్లో ప్రత్యక్షదాడులు సరికాదని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: గన్ మెన్ అలెర్ట్ గా ఉన్నందనే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎక్కువ గాయాలు కాలేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు.సోమవారంనాడు హైద్రాబాద్ యశోద ఆసుపత్రి వద్ద మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులను ఖండిస్తున్నామన్నారు. గన్ మెన్ అలర్ట్ గా ఉన్నందున కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని నిలువరించినట్టుగా హరీష్ రావు వివరించారు. ఏమైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. గజ్వేల్ ఆసుపత్రిలో వైద్యులు కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత హైద్రాబాద్ కు తరలించాలని సూచించారన్నారు.
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డికి వైద్యులు సిటీ స్కాన్ చేశారని మంత్రి చెప్పారు. కత్తి పోటు కారణంగా ప్రభాకర్ రెడ్డి కడుపులో రక్తస్రావం జరిగిందని వైద్యులు గుర్తించారన్నారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ణయించారని మంత్రి తెలిపారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చీమకు కూడ ప్రభాకర్ రెడ్డి హని చేయడన్నారు. ప్రభాకర్ రెడ్డి మృధు స్వభావి.... సౌమ్యుడని ఆయన గుర్తు చేశారు.కొత్త ప్రభాకర్ రెడ్డిని ఊహించలేదని హరీష్ రావు చెప్పారు.
undefined
also read:మాకు తిక్కరేగితే దుమ్ము రేగాలి: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై విపక్షాలపై కేసీఆర్ ఫైర్
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని సూరంపల్లిలో ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో గాయపడిన ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. చేతకాని దద్దమ్మలే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
తాము తలుచుకుంటే రాష్ట్రంలో దుమ్ము రేగాలని కేసీఆర్ చెప్పారు. మరో వైపు ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని గవర్నర్ తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఆదేశించారు.