అచ్చేదిన్ రాలేదు, సచ్చేదిన్ వచ్చింది: బీజేపీపై హరీష్ రావు ఫైర్

Published : Aug 26, 2021, 03:49 PM IST
అచ్చేదిన్ రాలేదు, సచ్చేదిన్ వచ్చింది:  బీజేపీపై హరీష్ రావు ఫైర్

సారాంశం

బీజేపీపై తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. బీజేపీ సర్కార్ హయంలో  అచ్చేదిన్ రాలేదని, సచ్చేదిన్ మాత్రమే వచ్చిందని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో  ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.  

హూజూరాబాద్: బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్  రాలేదని, సచ్చేదిన్ మాత్రమే వచ్చిందని తెలంగాణ  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.గురువారం నాడు ఆయన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి   ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఈటల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు బాగుపడాలా ఈటల బాగుపడాలా ఆలోచించాలని ఆయన కోరారు.

అమ్మకానికి బీజేపీ,టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపమని ఆయన చెప్పారు. రైళ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని ఆయన చెప్పారు.  ఢిల్లీ నుండి బీజేపీ నేతలు వచ్చినా ఏం చేయలేరని  మంత్రి హరీష్ రావు చెప్పారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపును మంత్రి హరీష్ రావు తన భుజాలపై వేసుకొన్నాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం  టీఆర్ఎస్, బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?