డప్పు కొట్టినందుకు జీతం పెంచమన్నందుకు.. 70 దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణ

By Siva KodatiFirst Published Aug 26, 2021, 3:15 PM IST
Highlights

నిజామాబాద్ జిల్లాలో 70 దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి  కమిటీ బహిష్కరించింది. డప్పు కొట్టేందుకు రూ.500 పెంచమని అడిగినందుకు తమను సర్పంచ్ వెలివేశారని బాధితులు వాపోయారు. 

నిజామాబాద్ జిల్లాలో 70 దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి  కమిటీ బహిష్కరించింది. డప్పు కొట్టేందుకు రూ.500 పెంచమని అడిగినందుకు తమను సర్పంచ్ వెలివేశారని బాధితులు వాపోయారు. రెండేళ్ల నుంచి ఈ అన్యాయం జరుగుతోందని దళితులు తెలిపారు. న్యాయం కోరుతూ నిజామాబాద్ కలెక్టరేట్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఇతర కులాలకు చెందిన వారిని తీసుకొచ్చి డప్పు కొట్టిస్తూ అదనంగా చెల్లిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 
 

click me!