దళిత బంధుకు మరో రూ.500 కోట్లు విడుదల...

By AN TeluguFirst Published Aug 26, 2021, 3:47 PM IST
Highlights

ఇప్పటికే ఈ పథకానికి రూ. 1500 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 500 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకూ మొత్తం రూ. 2వేల కోట్లు మంజూరు చేసింది. 

హైదరాబాద్ : దళిత బంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికిి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ పథకానికి రూ. 1500 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 500 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకూ మొత్తం రూ. 2వేల కోట్లు మంజూరు చేసింది. 

హైదరాబాద్: దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళిత బంధు కోసం మరో రూ.500కోట్లు విడుదలయ్యాయి. ఈ దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలుచేస్తుండగా ఇప్పటికే ఓ దఫా రూ.500కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో ఐదువందల కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలా ఇప్పటివరకు హుజురాబాద్ లో దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ.1000కోట్లు విడుదల చేసింది. 

కాగా, ఈనెల 23న హుజురాబాద్ లో ఇటీవల దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించి తీరతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గానికి రూ.2000కోట్లు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే  ఇప్పటికే రూ.1000కోట్లను విడుదల చేసిన కేసీఆర్ సర్కార్ మరోరూ.1000కోట్లను వారం రోజుల్లో విడుదల చేయడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. 

గత సోమవారం హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి దళితబంధు పథకాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్.  పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 21 వేల మంది దళిత కుటుంబాలు ఉన్నట్టుగా సమగ్రసర్వే రిపోర్టులో తేలిందని సీఎం పేర్కొన్నారు. వచ్చే నెల రెండు మాసాల్లో ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి డబ్బులు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.2వేల కోట్లను విడుదల చేయాలని అదే వేదిక నుండి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. రైతు బంధు తరహాలోనే దళితబంధు నిధులు లబ్దిదారులకు అందుతాయన్నారు. దళితబంధు కచ్చితంగా విజయవంతం కానుందన్నారు. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు ఒక మహా ఉద్యమమని కేసీఆర్ చెప్పారు.  

అంతకుముందు తన దత్తత గ్రామం వాసాలమర్రి పర్యటనలోనే దళిత బంధును ప్రారంభించారు సీఎం కేసీఆర్. గ్రామంలోని దళిత కుటుంబాలన్నింటికి రూ.10లక్షల చొప్పున అందివ్వనున్నట్లు ప్రకటించి ఆ తర్వాతి రోజే అందుకు సంబంధించిన నిధులు విడుదల చేశారు. మొత్తం 76 కుటుంబాలకు  ఏడు కోట్లు అరవై లక్షలు అందించారు. ఇప్పుడు హుజురాబాద్ దళితులందరికి దళిత బంధు డబ్బులు అందివ్వడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 

click me!