"మీ ప్రేమ వెలకట్టలేనిది..  నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే.." భావోద్వేగానికి గురైన హరీష్‌ రావు

Published : Apr 09, 2023, 05:44 PM IST
"మీ ప్రేమ వెలకట్టలేనిది..  నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే.." భావోద్వేగానికి గురైన హరీష్‌ రావు

సారాంశం

Harish Rao: సిద్ధిపేటలో పర్యటించిన మంత్రి హరీష్‌ రావు భావోద్వేగానికి గురయ్యారు. మీ ప్రేమ, ఈ బలగాన్ని చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేననిపిస్తోందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని మంత్రి హరీష్‌ రావు అన్నారు. 

Harish Rao: సిద్ధిపేట పర్యటనలో తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం సిద్ధిపేటలోని రాఘవపూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ రావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. "మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే.. నిజంగా నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. ఇంత ప్రేమ .. ఇంతటి ఆదరణ, అభిమానాలు దొరుకుతుంటే.. మీకు ఎంత సేవ  చేసిన తక్కువే అనిపిస్తుంది. మీకు ఇంకా చాలా సేవ చేయాలి. మీ ప్రేమ, ఈ బలగాన్ని చూస్తుంటే... నిజంగా  ఎన్ని జన్మలెత్తినా.. మీ రుణం తీర్చుకోలేను. ఈ జీవితం.. నా ఊపిరి ఉన్నంత కాలం మీ సేవ చేస్తూనే ఉంటాను. పదవులు ఉండొచ్చు, పోవచ్చు.. ఏ పదవీ అన్నది ముఖ్యంగా కాకపోవచ్చు.. కానీ మీ ప్రేమ, అప్యాయత వెలకట్టలేనిది. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేనిది. మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేకపోతున్నా..  కళ్లలో నీళ్లొస్తున్నాయి" అని మంత్రి హరీష్ భావోద్వేగానికి గురయ్యారు.

రానే రాదు అన్న తెలంగాణ, కానే కాదన్న కాళేశ్వరం కట్టుకున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతో మండుటెండల్లో చెరువులు మత్తల్లు దుంకుతున్నాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతున్నదని అన్నారు.  వెనుకట పంట వేయాలంటే మోగులు వైపు చూసేది.. నేడు కెసిఆర్ సాధన వల్ల కాలంతో సంబంధం లేకుండా పంట వేస్తున్నామనీ,  తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 138కోట్ల రూపాయల వడ్లు పండితే.. నేడు 1548 కోట్లు రూపాయల వడ్లు పండుతున్నాయని తెలిపారు.

కెసిఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన ప్రగతి సాధించమనీ,  రాష్ట్రం వచ్చాక ఎరువుల కోసం ఇబ్బంది లేదని అన్నారు. ప్రతి పక్షాలు.. కాళేశ్వరం దండగా అన్నారనీ, ఓ సారి ఈ గ్రామాలలోకి వస్తే.. పండగో, దండగో తెలుస్తుందని చురకలంటించారు. నిన్న హైదరబాద్ సభలో ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారనీ,
రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు.  మోడీ.. దొంగే దొంగా అన్నట్లు మాట్లాడాడు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ,– మెడికల్‌ కాలేజీలు, జాతీయ ప్రాజెక్టులు ఇవ్వనిది ప్రధాని మోదీయే ఆరోపించారు.

కరెంట్ మోటార్లుకు మీటర్లు పెట్టాలని 30వేల కోట్లు నిలిపివేశారని, తెలంగాణ అభివృద్ధినీ బీజేపీ  అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే గృహ లక్ష్మి కార్యక్రమం ప్రారంభం చేసుకుందామనీ, కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట బీడీ కార్మికులకు పించడ్లు ఇవ్వలేదని తెలిపారు.  గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలలో ఉన్న సేవలు సిద్దిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అందిస్తామని  మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu