ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వస్తోంది కానీ..: ఈటల సంచలనం

By narsimha lodeFirst Published Apr 2, 2021, 6:12 PM IST
Highlights

ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వస్తోంది, మనల్ని పాలించే వారికి మెరిట్ ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్:ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వస్తోంది, మనల్ని పాలించే వారికి మెరిట్ ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు  బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరిగింది.  రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొనే మెరిట్ పాలకుల్లో ఉండాలన్నారు.

మంత్రిగా ఉన్నా తాను మొదట మనిషిని అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు లేకుంటే ఎవరికీ బతుకు లేదన్నారు. రాజకీయ పార్టీల గురించి తాను మాట్లాడనని చెప్పారు. గ్రామీణ జీవితాన్ని చిన్నాభిన్నం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. మనల్ని పాలించేవారికి మెరిట్ ఉండాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం మెలగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏం కోరుకొంటున్నారో, ప్రజల అవసరాలు ఏమిటనే విషయం దిశగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.ప్రజల జీవితాల్లో మంటలు రేపే నిర్ణయాలు తీసుకొనే అధికారం ఎవరికి ఉండదన్నారు. 

ఇటీవల కాలంలో మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గత మాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే అసెంబ్లీ ముగిసిన వెంటనే కేటీఆర్ ఈటలను తన కారులో ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. 
 

click me!