నమ్మక ద్రోహం చేసిన వారు బాగుపడరు: ఈటల మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Jan 1, 2020, 2:30 PM IST

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


కరీంనగర్ :నమ్మక ద్రోహం చేస్తే తనకు బాధ కలుగుతోందని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also read:చెరో దారి: గంగుల, ఈటల మధ్య కొనసాగుతున్న అగాధం

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మినవారే మోసం చేస్తే తనకు బాధ కలుగుతోందని చెప్పారు. కొట్లాడడం  తెలుసు కానీ దొంగ దెబ్బ తీయడం తనకు తెలియదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు

నమ్మక ద్రోహం చేసిన వారు ఎప్పటికీ బాగుపడరని చెప్పారు. కోట్లు ఖర్చైనా తాను ఎవరి వద్ద కూడ చేయి చాపలేదన్నారు. ప్రజలు ధర్మం తప్పరు.. అందుకే తనను ప్రజలు గెలిపించారని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

ప్రజలు కూడ ధర్మం తప్పి ఉంటే తాను గెలిచే వాడిని కానని చెప్పారు. బుధవారం నాడు తన నియోజకవర్గంలో కార్యకర్తలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ పార్టీకి తాము ఓనర్లం అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో పెద్ద దుమారాన్ని రేపాయి.

కొత్త రెవిన్యూ చట్టం విషయమై  రెవిన్యూ అదికారులకు మంత్రి ఈటల రాజేందర్ సమాచారాన్ని లీక్ చేశారని ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి కూడ తప్పిస్తారని ప్రచారం సాగింది. కానీ, ఈటల రాజేందర్ ను మంత్రివర్గంలో కొనసాగించారు కేసీఆర్. 

ఈటల రాజేందర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు , కేటీఆర్ కు కూడ కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య సఖ్యత లేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

 

click me!