కార్పోరేట్ ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేసుకోవద్దు: మంత్రి ఈటల

By narsimha lodeFirst Published Sep 6, 2020, 4:59 PM IST
Highlights

ప్రపంచంలో ఎక్కడైనా  కరోనా కి చికిత్స ఒక్కటే.. అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు.
 

హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడైనా  కరోనా కి చికిత్స ఒక్కటే.. అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు.

ఎస్ ఆర్ నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ద్వారా 22 వేల మంది ఆశా వర్కర్స్, 500 మంది ఎఎన్ఎం లతో తెలంగా;ణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మొదటి రోజు నుండి హెల్త్ వారియర్స్ కంటిమీద కునకులేకుండా పని చేస్తున్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. 6 నెలల అనుభవంలో కరోనా కి చంపే శక్తి లేదు అని తెలిసిపోయింది. అయినా 99 శాతం మంది బయటపడుతున్నారన్నారు.

భయం లేకుండా ఎదుర్కొంటే కరోనా ను జయించవచ్చన్నారు. ఈ ధైర్యాన్ని ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ కూడా చేస్తున్నామన్నారు.

గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తించగలిగితే వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇతర సీజనల్ వ్యాధులు, కరోనా ఒకటే లక్షణాలు కలిగి ఉంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు.

రాపిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి కోరారు.  జనవరి వరకు ఇదే స్ఫూర్తి తో పని చేయాల్సిందిగా కోరారు. 

ఈ సందర్భంగా పలువురు ఆశా, ఎఎన్ఎంల  సమస్యలు  తీరుస్తామని హామీ ఇచ్చారు. జీతం పెంచే విషయం సీఎంతో చర్చిస్తామన్నారు.. 
కరోనా తరువాత ప్రతి జిల్లా ఆశా,ఎఎన్ ఎంలతో ప్రత్యేకంగా సమావేశం అవుతామని తెలిపారు. 
 

click me!