ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలకు రూ.2200, లాక్‌డౌన్ ఆలోచన లేదు: ఈటల

By narsimha lodeFirst Published Jun 15, 2020, 12:57 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలంాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని ఆయన ప్రకటించారు. 

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలంాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని ఆయన ప్రకటించారు. లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. 

సోమవారం నాడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల నిర్వహణకుగాను రూ. 2200గా నిర్ణయించినట్టుగా ఆయన చెప్పారు.వెంటిలేటర్‌తో కరోనా రోగికి కరోనా చికి్త్స అందిస్తే ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకు రూ. 9 వేలు వసూలు చేయవచ్చన్నారు.

వెంటిలేటర్ లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తే రోజుకు రూ. 7500గా ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత హైద్రాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

also read:కరోనా పరీక్షలకు వెళ్లి 15 రోజులుగా అదృశ్యం: నరేందర్ సింగ్ కుటుంబసభ్యుల ఆందోళన

కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతి రోజూ రూ. 4 వేలు వసూలు చేయాలని ఆయన సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకపోతే హొం క్వారంటైన్ లో ఉంటే సరిపోతోందన్నారు.ఐసీఎంఆర్ గుర్తించిన ల్యాబ్స్ ల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఐసోలేషన్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేస్తారని ఆయన చెప్పారు. 

హైద్రాబాద్‌లో సామాజిక వ్యాప్తి లేదని కూడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. ఏ మాత్రం అనుమానం ఉన్నా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ఈటల స్పష్టం చేశారు.

హైద్రాబాద్ లో కరోనా కేసులను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు. ముంబై, అహ్మాదాబాద్ లాంటి పరిస్థితులు హైద్రాబాద్‌లో లేవన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  ప్రతి రోజూ 7500 మందికి పరీక్షలు నిర్వహించే సత్తా ఉందన్నారు.

జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని సుమారు 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ పరీక్షలను వారం పది రోజుల్లో పూర్తి చేస్తామని  మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

click me!