కరోనా టెస్టులు చేయించుకున్న ఎర్రబెల్లీ.. రిజల్ట్ ఎంటంటే..?

Siva Kodati |  
Published : Sep 05, 2020, 06:39 PM IST
కరోనా టెస్టులు చేయించుకున్న ఎర్రబెల్లీ.. రిజల్ట్ ఎంటంటే..?

సారాంశం

ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాల జరగనున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సిబ్బందితో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 

ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాల జరగనున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సిబ్బందితో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రి ఎర్రబెల్లి సహా ఆయన సిబ్బందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకే  తన సిబ్బందితో కలిసి కరోనా టెస్ట్ చేయించుకున్నాని అన్నారు. ప్రజలు కూడా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరంలో వుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి  కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తన కోరలను విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2511 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య లక్షా 38 వేల 395కు చేరుకుంది.

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించివారి సంఖ్య 877కు చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో కరోనా నుంచి 2578 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 4 వేల 603కు చేరుకుంది. ఇంకా 32915 యాక్టివ్ కేసులున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu