Telangana Local Body Elections 2025 : స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. జీవో 9పై హైకోర్ట్ స్టే

Published : Oct 09, 2025, 04:17 PM ISTUpdated : Oct 09, 2025, 05:25 PM IST
Telangana Local Body Elections 2025

సారాంశం

Telangana Local Body Elections 2025 : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు పెంపునకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోపై స్టే విధించిన హైకోర్టు.

Telangana Local Body Elections 2025 : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను కొనసాగించకుండా జీవో 9 పై స్టే విధించింది. దీంతో ఇప్పటికే విడుదలచేసిన ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా మారిపోబోతోంది... మొదటి విడత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్డ్ ఆర్డర్ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి రానుంది.

బిసి రిజర్వేషన్ల పెంపు 

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచింది... ఇందుకోసం జీవో 9 తీసుకువచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు 60 శాతానికి మించిపోయాయి... దీంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. కొందరు ఈ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు... గత రెండ్రోజులుగా ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం జీవో 9 పై మధ్యంతర స్టే విధించింది. దీంతో ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

 స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా…

తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్లు ఈ బిసి రిజర్వేషన్ల పెంపు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, పిటిషనర్లను ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది న్యాయస్థానం. అలాగే 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది న్యాయస్థానం. దీంతో ఎన్నికలు నెలరోజుల పాటు వాయిదాపడే అవకాశాలున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇక్కడకూడా మహిళల పెత్తనమే వస్తది.. సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Funny Punches
స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ... రూ. 16 కోట్ల‌తో హైదరాబాద్ శివారులోని ఈ ప్రాంతానికి కొత్త ఊపు