అందులో బీజేపీ నేతల హస్తం ఉంటే రాజీనామాకు సిద్దమా?: బండి సంజయ్‌కు మాధవరం కృష్ణారావు సవాలు..

Published : Sep 15, 2022, 12:04 PM IST
అందులో బీజేపీ నేతల హస్తం ఉంటే రాజీనామాకు సిద్దమా?: బండి సంజయ్‌కు మాధవరం కృష్ణారావు సవాలు..

సారాంశం

మూసాపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెరువులు కబ్జా చేస్తున్నారని బండి సంజయ్ చేసిన ఆరోపణలపై మాధవరం కృష్ణారావు స్పందించారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూసాపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెరువులు కబ్జా చేస్తున్నారని బండి సంజయ్ చేసిన ఆరోపణలపై మాధవరం కృష్ణారావు స్పందించారు. తాను చెరువుల కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. బీజేపీ నేతల హస్తం ఉంటే బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా? అని సవాలు విసిరారు. 

ఇక, బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రను కొనసాగిస్తున్నారు. బుధవారం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులను కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములు, పేదల ఇండ్లను కూడా వదిలిపెట్టకుండా కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?