కవితతో న్యాయవాదుల భేటీ:టీఆర్ఎస్ కు న్యాయవాదుల మద్దతు

Published : Oct 08, 2018, 08:53 PM IST
కవితతో న్యాయవాదుల భేటీ:టీఆర్ఎస్ కు న్యాయవాదుల మద్దతు

సారాంశం

ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందనిన్యాయవాదులు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో జై కొడతామంటూ ప్రకటించారు. 

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందనిన్యాయవాదులు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో జై కొడతామంటూ ప్రకటించారు. 
 
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారని న్యాయవాదులు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇలా న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడలేదన్నారు. 

ప్రతి న్యాయవాది కుటుంబానికి హెల్త్ కార్డ్స్ ఇచ్చారని అభిప్రాయపడ్డారు. న్యాయ వాదులకు మేలు చేసిన టీఆర్ఎస్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌