అందరికీ స్ఫూర్తిదాయకం: మాస్కులను కుట్టి ఉచితంగా పంచుతున్న లేడీ పోలీస్!

By Sree s  |  First Published Apr 17, 2020, 3:57 PM IST

ప్రజలందరికీ మాస్కులు అవసరాన్ని గుర్తించి, వారి ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఒక పోలీస్ కానిస్టేబుల్ నడుం బిగించింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్ద పనిచేసే ఐదుగురు మహిళా రక్షణ సిబ్బందిలో అమరేశ్వరి ఒకరు. 


కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతున్న వేళ ప్రజలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఈ మహమ్మారి  విరుచుకుపడడంతో మాస్కులు ఇతరాత్రాల కొరత కొనసాగుతున్న విషయం తెలిసిందే! 

ఇలా ఈ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నవేళ ప్రజలంతా ఈ వైరస్ నుండి కాపాడుకునేందుకు మాస్కులను ధరిస్తున్నారు. ప్రభుత్వం కూడా తాజాగా ఈ మాస్కులను ధరించడం తప్పనిసరి చేసింది. 

ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ మాస్కులు అవసరాన్ని గుర్తించి, వారి ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఒక పోలీస్ కానిస్టేబుల్ నడుం బిగించింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్ద పనిచేసే ఐదుగురు మహిళా రక్షణ సిబ్బందిలో అమరేశ్వరి ఒకరు. 

ఆమె ఉదయం 6 గంటలకు విధుల్లోకి ఎక్కితే రాత్రి 9.30 నిముషాలకు తన విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఆమెకు సెలవు ఉంటుంది. ఇలా ఒక నెలలో సరాసరిన 15 రోజులు ఫుల్ డ్యూటీని నిర్వహిస్తారు. 

ఇలా ఖాళీ సమయంలో రెస్ట్ తీసుకోకుండా తన వంతు సహాయంగా మాస్కులను తయారు చేసి మనిషికి మూడు మాస్కుల చొప్పున ఉచితంగా పంచుతున్నారు. ఈ కరోనా మహమ్మారి వేళ ప్రజలు తమని తాము రక్షించుకోవడానికి చేస్తున్న యుద్ధంలో ఆమె ప్రజలందరికీ కూడా అవసరమైన మాస్కునుం అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటినుండి ఆమె ఇలా మాస్కులను కుట్టడం ప్రారంభించారు. ఇక్కడొక ఆసక్తికర అంశం ఏమిటంటే..,. ఆమెకు ఈ మాస్కులను కొట్టడానికి పూర్వం తైలారింగ్ రాదూ. ఆమె యు ట్యూబ్ వీడియోలు చూసి మిషన్ కుట్టడం నేర్చుకున్నారు. 

చీరలు, డ్రెస్ మెటీరియల్ వ్యాపారం చేసే తన ఫ్రెండ్ వద్ద బ్లౌజ్ పీసుల మెటీరియల్ ఉండడంతో ఆమె వాటిని కొని ఇలా మాస్కులను కుట్టి ప్రజలకు అందిస్తున్నారు. ఆమె డ్యూటీ కి వెళ్లే దారిలో, ఇంటి వద్ద ఎక్కడైనా సరే మాస్కులు లేనివారు ఎవ్వరు కనబడ్డా సరే ఆమె వెంటనే వారికి మూడు మాస్కులను అందజేస్తున్నారు. 

ఇవి కాటన్ తో తయారవడం వల్ల వీటిని ఉతికి మళ్ళీ వాడుకోవచ్చని చెబుతూ ఈ కరోనా పై పోరులో భాగంగా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఇప్పటివరకు ఆమె 3000 మాస్కులను తయారుచేసి పంచారు. వాస్తవానికి 5000 మాస్కులను పంచుదామని అనుకున్నప్పటికీ... ఈ కరోనా మహమ్మారి అంతకంతకు పెరిగిపోతుండడంతో 10,000 మాస్కులను కుట్టి పంచాలని అనుకుంటున్నట్టు అమరేశ్వరి తెలుపుతున్నారు. 

నల్గొండ జిల్లాకు చెందిన అమరేశ్వరి 2008లో పోలీసు ఉద్యోగంలో చేరారు. ఉండేదేమో కాటేదాన్. ఇంటి నుంచి రాజ్ భవన్ వరకు రోజు 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరల ఇలా కష్టపడుతూ ఈ మహమ్మారి పై యుద్ధానికి ప్రజలందరినీ సంసిద్ధులను చేస్తున్న అమరేశ్వరి నిజంగా ట్రూ వారియర్. 
 

click me!