గులాబీ నేతలకు పదవుల పండగే: సీనియర్లకు తొలి ప్రాధాన్యత

By narsimha lodeFirst Published Feb 12, 2020, 6:20 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ సీనియర్లకు నామినేటేడ్ పదవులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 


హైదరాబాద్: టీఆర్ఎస్‌లో నామినేటెడ్ పదవుల పంపిణీ మొదలైంది. రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడిప్పుడే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నారు.ఎన్నికలన్నీ పూర్తి కావడంతో నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

సీనియర్ ఎమ్మెల్యేలకు రాష్ట్రస్థాయిలో గౌరవప్రదమైన కార్పొరేషన్లకు ఛైర్మెన్ లుగా నియమించాలని కేసీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలకు కనీసం పదిహేను కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 అందులో భాగంగా మూసీ రివర్  డెవలప్మెంట్  కార్పొరేషన్ చైర్మన్ గా సీనియర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిడ్డి నియమించారు. ఆర్టీసీ, మిషన్ భగీరథ,ఇరిగేషన్ బోర్డ్ లాంటి సంస్థలకు సీనియర్ ఎమ్మెల్యే కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సీనియర్లు గా గుర్తింపు పొందిన బాజిరెడ్డి గోవర్ధన్, పద్మాదేవేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ప్రకాష్ గౌడ్, నాయిని నర్సింహారెడ్డి లాంటి నేతలకు త్వరలోనే పదవులు వరించనున్నట్లు తెలుస్తోంది.

రాబోయే రెండు నెలల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు. చైర్మన్ పదవులతో పాటు ఆయా చైర్మన్ లకు డైరెక్టర్ల పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తారని తద్వారా 4 నుంచి 5 వేల మంది నాయకులకు పదవులు దక్కుతాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

 గత ప్రభుత్వ హాయంలో భర్తీ చేసిన కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మరోసారి వారినే కొనసాగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఏడాది పదవుల పంపిణీలో  శాసనసభ్యులకు, సీనియర్ నేతలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నేతలు చేసిన పని కూడా బేరీజు వేసుకునే పదవులు కట్ట పెడతారని నేతలు అంటున్నారు.


 

click me!