ఏపీతో పోలిస్తే తెలంగాణలో జూడాలకు మెరుగైన స్టైఫండ్: డీఎంఈ రమేష్ రెడ్డి

By narsimha lodeFirst Published May 26, 2021, 5:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లతో పోలిస్తే తెలంగాణలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు  ఎక్కువ స్టైఫండ్ ఇస్తున్నామని తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి చెప్పారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లతో పోలిస్తే తెలంగాణలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు  ఎక్కువ స్టైఫండ్ ఇస్తున్నామని తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. 2018లో దేశంలో ఏ రాష్ట్రంలో చెల్లించని విధంగా 40 శాతం ఉపకార వేతనం పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీనియర్ డాక్టర్స్ వేతనం రూ. 44 వేల నుండి రూ. 70వేలకు పెంచామన్నారు.

also read:కరోనా వేళ జూనియర్ డాక్టర్ల సమ్మె: తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్

ఈ ఏడాది కూడ 15 శాతం స్టైఫండ్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్స్  కు కూడ వేతనాలు పెంచామన్నారు.డిమాండ్లు పరిష్కరించాలని జూడాల అసోసియేషన్ ప్రతినిధులు తన వద్దకు వస్తే  సమ్మె చేయాల్సిన పరిస్థితులు లేవని తాను వారికి చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

నిమ్స్ ఆసుపత్రిలోనే వైద్యం చేయాలనే డిమాండ్ సహేతుకం కాదన్నారు. టిమ్స్, గాంధీతో పాటు ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో జూడాలు, సీనియర్ రెసిడెంట్స్  కుటుంబసభ్యులకు కరోనా చికిత్స అందిస్తున్నామన్నారు. జూడాల సమ్మెతో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేశామన్నారు. 

click me!