
లడఖ్‌లో కొమురంభీం జిల్లా జవాను మృతి చెందారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షాకీర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో అమరుడయ్యారు.
షాకీర్ మరణవార్తను ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో షాకీర్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.