Nizamabad: ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) నిజామాబాద్‌లో కొత్త ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు. ఐటీని టైర్-2 పట్టణాలకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించిందనీ, అన్ని ప్రాంతాల అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.
Telangana IT Minister KTR: ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి(ఎంఏ అండ్ యూడీ) మంత్రి కే.తారకరామారావు (కేటీఆర్) నిజామాబాద్‌లో కొత్త ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు. ఐటీని టైర్-2 పట్టణాలకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించిందనీ, అన్ని ప్రాంతాల అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నిజామాబాద్ లో కొత్త ఐటీ హబ్ ను ప్రారంభించనున్నారు. యువత నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు వీలుగా ఎంబెడెడ్ టీ-హబ్, టాస్క్ సెంటర్లు కూడా ఈ హబ్ లో ఉంటాయని తెలిపారు. ఐటీ వృద్ధి వికేంద్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిజామాబాద్ లో ఐటీ హబ్ ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
I will be inaugurating a new IT Hub in Nizamabad city tomorrow as part of our efforts to take IT sector to Tier 2 cities & towns 😊
The IT Hub will also have an embedded T-Hub and TASK centre to help youngsters innovate and upskill
Giving wings to the aspirations of the youth… pic.twitter.com/U0br4mJ3yn
నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్ లలో ఐటీ హబ్ లు రాబోతున్నాయని గత ఏడాది మంత్రి ప్రకటించారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లలో ఐటీ హబ్ లు ఏర్పాటయ్యాయనీ, ప్రస్తుతం విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చే '3డీ మంత్ర' కింద రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా జిల్లా కేంద్రాలకు ఐటీ సేవలను విస్తరిస్తోందని పేర్కొన్నారు.
As part of the 3 D Mantra - Digitise, Decarbonise and Decentralise; Govt is taking IT to District Headquarters
Warangal, Khammam, Karimnagar IT Hubs are up & running successfully 👇
Next in Line are IT Hubs at Nizamabad, Mahbubnagar, Nalgonda, Siddipet and Adilabad pic.twitter.com/bVmJmcJwGL
ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించిందన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఐటీ హైదరాబాద్ కే పరిమితమైందని కేటీఆర్ పలు సందర్భాల్లో చెబుతూ.. విస్తరిణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.