కృష్ణా బేసిన్ లో 50:50 శాతం నీటి కేటాయించాలి: కేఆర్‌ఎంబీకి రజత్ కుమార్ లేఖ

By narsimha lode  |  First Published May 2, 2022, 9:25 PM IST

కృష్ణా బేసిన్ లో 50:50 శాతం నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కేఆర్ఎంబీ చైర్మెన్ కు లేఖ రాశారు.ఏపీకి కేటాయించిన నీటి కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకోకుండా చూడాలని కోరారు.


హైదరాబాద్: కృష్ణా బేసిన్ లో 50:50 శాతం నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ  రజత్ కుమార్ కేఆర్‌‌ఎంబీ చైర్మెన్ కు సోమవారం నాడు లేఖ రాశారు.తెలంగాణ ప్రాధాన్యతలు చెప్పినా కూడా బోర్డు పట్టించుకోవడం లేదన్నారు.నీటి కేటాయింపులకు మించి ఏపీ వినియోగించుకోకుండా చూడాలని కూడా  ఆ లేఖలో ఆయన కోరారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొంత కాలంగా నీటి వివాదాలు చోటు చేసుకొన్నాయి. కృష్ణా, గోదావరి రాష్ట్రాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు పరస్పరం పిర్యాదులు చేసుకొంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కి లేఖలు రాశారు. అంతేకాదు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు  నోటిఫికేషన్ కూడా జారీ చేసింది

Latest Videos

undefined

అయితే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిపస్తుంది. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను  తీసుకొంటే లాభ,నష్టాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ మురళీధర్ రావు నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేయనుంది.ఈ కమిటీ ఆదేశాల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.  ఏపీ మాత్రం ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకు రావడాన్ని స్వాగతించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించిన తర్వాతే తాము కూడా అప్పగిస్తామని గతంలోనే ఏపీ కేంద్రానికి తేల్చి చెప్పింది.

నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయని కారణంగా నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని తెలంగాణపై గతంలో ఏపీ ప్రభుత్వం పిర్యాదు చేసింది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ కూడా ఫిర్యాదు చేసింది. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా తెలంగాణ ఫిర్యాదులు  చేసింది.

నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం  విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని  ఏపీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్  నారాయణ రెడ్డి కేఆర్ఎంబీకి ఈ ఏడాది ఏప్రిల్ 5న లేఖ రాశారు.

Nagarjuna Sagar Project లో Telangana  ప్రభుత్వం Electricity ఉత్పత్తి కోసం  నీటిని ఉపయోగిస్తూ దిగువకు విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే Pulicninthala రిజర్వాయర్ కెపాసిటీ లెవల్ లో నీరుందని Andhra Pradesh ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా పులిచింతల  నుండి కూడా నీటిని విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.  ప్రకాశం బ్యారేజీలో కూడా నీరున్న విషయాన్ని ఏపీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకొచ్చారు.

విద్యుత్ ఉత్పత్తి పేరుతో నాగార్జున సాగర్ లో నీటిని ఉపయోగించడం వల్ల వేసవిలో Drinking Water అవసరాలకు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంటుందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని  నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలివివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.

 ప్రధానంగా కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం  నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అయితే తమ రాష్ట్ర అవసరాల మేరకు తమ నీటి వాటా మేరకే ఈ ప్రాజెక్టు ద్వారా వాడుకొంటామని ేపీ వాదిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే తెలంగాణ రాష్ట్రం ఏడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ వాదిస్తుంది.
 


.

click me!