హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో 80 కోట్ల విలువైన 8 కిలోల డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. టూరిస్ట్ వీసాపై వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి డ్రగ్స్ ను సీజ్ చేశారు.
హైదరాబాద్: హైద్రాబాద్ Shamshabad అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణీకుల నుండి 8 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు డీఆర్ఐ అధికారులు,. ఈ డ్రగ్స్ విలువ రూ. 80 కోట్లు ఉంటుందని చెప్పారు డీఆర్ఐ అధికారులు. టూరిస్ట్ వీసాపై హైద్రాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి DRI అధికారులు ఈ Drugs ను సీజ్ చేశారు.టాంజానియా, అంగోలాకు చెందిన ఇద్దరు ప్రయాణీకుల నుండి ఈ డ్రగ్స్ ను సీజ్ చేశారు.సూట్ కేసుల్లో సీక్రెట్ గా డ్రగ్స్ ను తీసుకు వస్తున్న సమయంలో డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.
టాంజానియా నుండి వచ్చిన ఓ పురుషుడు, ఆంగోలా నుండి వచ్చిన మహిళా ప్రయాణీకురాలి నుండి ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. టాంజానియా జాతీయుడు కప్ టౌన్ నుండి దుబాయ్ మీదుగా హైద్రాబాద్ కు వ్యాపార వీసాపై వచ్చారు. అంగోలా నుండి మహిళా ప్రయాణీకురాలు మొజాంబిక్ లుసాకా దుబాయ్ హైద్రాబాద్ కి చేరుకొన్నారు. నాలుగు కిలోల చొప్పున ఒక్కో ప్రయాణీకుడు తమ సూట్ కేసుల ట్రాలీ బ్యాగు అడుగు భాగంలో ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు రద్దు చేయడంతో డ్రగ్స్ స్మగ్లింగ్ పెరిగిపోయాయి.
undefined
దేశంలో పలువురు డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా కూడా డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.విమాన ప్రయాణీకులు టాబ్లెట్ల రూపంలో తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన ఘటనలున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో ముంబైలలో ఇద్దరు ప్రయాణీకులు 2.42 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ ప్రయాణీకుడి నుండి 1.15 కిలోల కొకైన్ ను హైద్రాబాద్ లో స్వాధీనం చేసుకొన్నారు. మరో కేసులో గత ఏడాది ఆగష్టులో బెంగుళూరులో ఓ ప్రయాణీకుడిని కిలో కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు
తెలంగాణలో డ్రగ్స్ పై తెలంగాణ సర్కార్ గట్టి చర్యలు తీసుకొంటుంది. డ్రగ్స్ సరపరా చేసే వారితో పాటు డ్రగ్స్ తీసుకొనే వారిపై కూడా కసులు నమోదు చేస్తున్నారు. హైద్రాబాద్ కమిషనర్ గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముంబైలో ఉన్న డ్రగ్స్ సరఫరా చేసే టోనిని అరెస్ట్ చేశారు. టోని నుండి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వ్యాపారులను కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు గంజాయి సరఫరా చేసే వారిపై కూడా పోలీసులు నిఘాను పెంచారు.
హైద్రాబాద్ లోని పబ్ లలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయమై కూడా పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. గత మాసంలో పుడింగ్ మింక్ పబ్ పై దాడి చేశారు. ఈ పబ్ లో డ్రగ్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల, మేనేజర్ అనిల్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.