
కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌లోని నీటిని తెలంగాణ, ఏపీకి 50:50 నిష్పత్తిలో కేటాయించాలని లేఖలో కోరారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు 50 శాతం కేటాయించాలని ఈఎన్‌సీ విజ్ఞప్తి చేశారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల జనాభా ఆధారంగా పంపకాలు జరపాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. క్యాచ్మెంట్ ఏరియా లెక్కన తెలంగాణకు 70.8 శాతం, ఏపీకి 29.2 శాతం నీటి పంపకాలు చేయాలని విజ్ఞప్తి చేసింది.