220 పనిదినాలే టార్గెట్ ... పండుగ సెలవులు కుదింపు: అకడమిక్ క్యాలెండర్‌పై ఇంటర్ బోర్డ్ కసరత్తు

Siva Kodati |  
Published : Jul 20, 2021, 08:28 PM IST
220 పనిదినాలే టార్గెట్ ... పండుగ సెలవులు కుదింపు: అకడమిక్ క్యాలెండర్‌పై ఇంటర్ బోర్డ్ కసరత్తు

సారాంశం

జూలై 1 నుంచి 220 పనిదినాలు ఉండేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించింది తెలంగాణ ఇంటర్ బోర్డ్. ఈ విద్యా సంవత్సరం కూడా 70 శాతం సిలబస్ వుంటుందని వెల్లడించింది.  

అకడమిక్ క్యాలెండర్‌పై తెలంగాణ ఇంటర్ బోర్డ్ కసరత్తు చేపట్టింది. జూలై 1 నుంచి 220 పనిదినాలు ఉండేలా క్యాలెండర్ రూపొందించింది. దసరా, సంక్రాంతి సెలవులను కుదించనున్న బోర్డ్.. ఈసారి అర్థ సంవత్సర పరీక్షలు నిర్వహించే ఆలోచనలో వుంది. అక్టోబర్ చివరి వారంలో అర్థ సంవత్సర పరీక్షలు వుంటాయని తెలిపింది ఇంటర్ బోర్డ్. 2022 ఫిబ్రవరి చివరి వారంలో ప్రాక్టీకల్స్ ప్రారంభం కానుండగా.. 2022 మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగననున్నాయి. మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసిన ఇంటర్ బోర్డ్.. ఈ విద్యా సంవత్సరం కూడా 70 శాతం సిలబస్ వుంటుందని వెల్లడించింది. 
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu