కేసీఆర్ పిట్టల దొర: చెరుకు సుధాకర్ తో కలిసి మందకృష్ణ

First Published 10, Sep 2018, 10:36 AM IST
Highlights

10వ తేదీన ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం    నిర్వహిస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం. కొంగర్ కలన్ లో  జరిగే “ప్రజాగ్రహ” సభను విజయవంతం చేసి ఉద్యమశక్తుల దమ్మేందో చూపిస్తామని, కెసిఆర్ కంటి వెలుగులో కండ్లు పరీక్ష చేయించుకొని ఉద్యమకారులు పెట్టె సభను చూడాలని చెరుకు సుధాకర్, మందకృష్ణ మాదిగ సవాల్ విసిరారు.

ఇంటి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ చెరుకు సుధాకర్, ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందృష్ణ మాదిగతో కలిసి హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. వారెమన్నారో వారి మాటల్లోనే...

👉 డా. చెరుకు సుధాకర్..ఇంటి పార్టీ వ్యస్థాపకులు...
•    10వ తేదీన ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం    నిర్వహిస్తున్నాం.
•    ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది.
•    కొంగర్ కలన్ లో  జరిగే “ప్రజాగ్రహ” సభను విజయవంతం చేసి ఉద్యమశక్తుల దమ్మేందో చూపిస్తాం.
•    కెసిఆర్ కంటి వెలుగులో కండ్లు పరీక్ష చేయించుకొని ఉద్యమకారులు పెట్టె సభను చూడమని సవాల్ విసిరారు.
•    మోసపూరితమైన హామీలతో ప్రజలను మల్ల మోసం చెయ్యలేవు కెసిఆర్.
•    లక్షల ఎకరాలకు నీళ్లు అని చెప్పి కాంట్రాక్టర్ల జేబులు నింపిండు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు.

👉మంద కృష్ణ మాదిగ......
•    కేసీఆర్ పిట్టల దొరల మాటలు చెబుతున్నారు. పిట్టల దొరల సంఘానికి కేసీఆర్ ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి.
•    ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో  తెలియని వాళ్లకు మీడియా ఇచ్చే ప్రాధాన్యత కంటే..ఉద్యమ కారులకి  ప్రాధాన్యత ఇవ్వాలి.
•    ప్రగతి మీద ఒక గంట మాట్లా డే ధైర్యం లేదు మోసాలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రగతి ఉంది.

👉యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఇంటి పార్టీ ఉపాధ్యక్షులు...
•    ఈ సిఎం మల్లోద్దు..సాలు దొర నీ పాలన..
•    అన్ని వర్గాల ప్రజలు కెసిఆర్ అరాచకమైన పాలనతో విసుగెత్తి ఉన్నారు.
•     కొంగర కలాన్లో 10 లక్షల మంది సామాజిక ఉద్యమకారులతో సభ పెట్టి ఉద్యమకారుల బలం చూపిస్తాం.
•     కొంగర్ కలాన్లో సభ పెట్టి కెసిఆర్ వైఫల్యాల చిట్టా విప్పుతాం.
•    మళ్ళీ కెసిఆర్ గెలిస్తే ప్రజాస్వామ్యం ఖూని అవుతుంది.
•     ప్రజాస్వామ్యన్నీ ఖూని చేసే పరిపాలన 4 ఏళ్లలో కనపడింది.

Last Updated 19, Sep 2018, 9:17 AM IST