తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

By narsimha lodeFirst Published Jan 28, 2021, 5:14 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం నాడు విడుదల చేసింది.
 

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం నాడు విడుదల చేసింది.ఈ ఏడాది మే 1వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.ఏప్రిల్ 1న ఎథిక్స్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టీకల్స్ పరీక్షలను నిర్వహిస్తారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యాసంస్థలను పున:ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం విద్యాసంస్థలను ఆదేశించింది. తొలుత మార్చిి మాసంలోనే ఎన్నికలు నిర్వహించాలని భావించారు. అయితే సిలబస్ పూర్తి కాని నేపథ్యంలో ఈ ఏడాది మే మాసానికి పరీక్షలను వాయిదా వేశారు.పరీక్షల నిర్వహణ విషయంలో కూడ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకొంటున్నారు.

 


ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

మే 1 లాంగ్వేజ్ పేపర్ 1

మే 3న ఇంగ్లీష్ పేపర్ 1

మే 5న ఇంగ్లీష్  గణితం పేపర్ 
   బాటనీ
 సివిక్స్ 
సైకాలజీ
మే 7 గణితం పేపర్ 2
జువాలజీ పేపర్ 1
హిస్టరీ పేపర్ 1
మే 10న ఫిజిక్స్ పేపర్ 1
ఎకనామిక్స్ పేపర్ 1
క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్ 1

మే 12న కెమిస్ట్రీ పేపర్ 1
కామర్స్ పేపర్ 1
సోషియాలజీ పేపర్ 1
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1

మే 17న జియాలజీ పేపర్ 1
హోం సైన్స్ పేపర్ 1
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1
లాజిక్ పేపర్ 1
బ్రిడ్జి కోర్సు మాథ్య్స్ పేపర్ 1

మే 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1
జాగ్రఫీ పేపర్ 1

 

 

click me!