తెలంగాణలో ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులకు గుడ్ న్యూస్: ఉచితంగా ఎంసెట్ కోచింగ్‌

By narsimha lodeFirst Published Dec 5, 2022, 10:09 PM IST
Highlights

తెలంగాణలోని ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్ధులకు ఈ విద్యాసంవత్సరం నుండి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని  అధికారులను ఇంటర్ బోర్డు కోరింది. 

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్ధులకు ఉచితంగా  ఎంసెట్ లో శిక్షణ  ఇవ్వాలని ఇంటర్మీడియట్  బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్ధులందరికీ  ఉచితంగా  ఎంసెట్ లో శిక్షణ ఇవ్వనున్నారు.  మెరిట్ విద్యార్ధులను గుర్తించేందుకు గాను  ఫిబ్రవరిలో స్క్రీనింగ్  నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ లో సెలెక్టైన విద్యార్థులకు ఏప్రిల్, మే మాసాల్లో ఎంసెట్  రెసిడెన్షియల్  శిక్షణ ఇవ్వనున్నట్టుగా ఇంటర్మీడియట్  బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్  చెప్పారు.

జిల్లాల వారీగా మెరిట్ విద్యార్ధులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాలో బాలురు, బాలికలను ఎంపిక చేయనున్నారు. ప్రతి జిల్లాల్లో  ఎంసెట్  కోచింగ్ కోసం అవసరమైన చర్యల కోసం ఇప్పటి నుండే  ఏర్పాట్లను ప్రారంభించాలని సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. ఇందుకు గాను జిల్లా అధికారులు, కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశాలను నిర్వహించనున్నారు. ఎంసెట్ శిక్షణకు ఎంపికైన విద్యార్దులకు  ఇంటర్మీడియట్ బోర్డు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందించనుంది.రెగ్యులర్  తరగతులకు ఇబ్బంది కలగకుండా ఎంసెట్  కోచింగ్ నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశించింది.ఎంసెట్ 2023 కి డాక్టర్ జ్యోత్స్యారాణి ఎస్ఐవి సమన్వయకర్తగా  వ్యవహరిస్తారని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఎంసెట్ కోచింగ్  కోసం  ప్రైవేట్ కాలేజీలు విద్యార్దులకు ఇంటర్ తరగతులతో పాటే కోచింగ్ ఇస్తారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులకు మాత్రం  ఏప్రిల్, మే మాసాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కోచింగ్ కోసం విద్యార్ధులను  ఎంపిక  చేయనున్నారు.ఇందుకు గాను స్క్రీనింగ్ టెస్టును నిర్వహించనున్నారు. 

click me!