ధాన్యం అమ్మడానికి వచ్చి: వరికుప్పపై కుప్పకూలిన రైతు

Siva Kodati |  
Published : May 08, 2019, 11:09 AM IST
ధాన్యం అమ్మడానికి వచ్చి: వరికుప్పపై కుప్పకూలిన రైతు

సారాంశం

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతు ఎండదెబ్బకు వరికుప్పపైనే కుప్పకూలాడు.

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతు ఎండదెబ్బకు వరికుప్పపైనే కుప్పకూలాడు. యల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి గోపాల్ అనే రైతు తన ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చాడు.

ఐదు రోజులుగా వరి కొనుగోలు కోసం అక్కడే పడిగాపులు కాస్తున్న అతను వరికుప్పపైనే పడుకున్నాడు. ఈ క్రమంలో ఎండ వేడిమి తట్టుకోలేక వడదెబ్బకు గురై అతను బుధవారం మరణించాడు.

దీంతో తోటి రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వారు కూడా తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్