హైకోర్టు ఆదేశాలు...నారాయణ, చైతన్య కాలేజీలకు షాకిచ్చిన ఇంటర్ బోర్డు

Arun Kumar P   | Asianet News
Published : Apr 17, 2020, 09:33 PM ISTUpdated : Apr 17, 2020, 09:40 PM IST
హైకోర్టు ఆదేశాలు...నారాయణ, చైతన్య కాలేజీలకు షాకిచ్చిన ఇంటర్ బోర్డు

సారాంశం

హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ  తెలంగాణ ఇంటర్ బోర్డు పలు జూనియన్ కాలేజీలపై చర్యలు తీసుకుంది. 

అమరావతి: తెలంగాణలోని పలు ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. హైకోర్టు ఆదేశాలపై స్పందించిన బోర్డు 68 కాలేజీల అనుమతులు రద్దు చేసింది.   రద్దు అయిన వాటిలో 26 నారాయణ, 18 శ్రీచైతన్య కళాశాలలు వున్నాయి. ఈ-మెయిల్ ద్వారా సదరు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు పంపింది ఇంటర్ బోర్డ్. నిబంధనలు పాటించనందుకు చర్యలు తీసుకున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. 

ఇంటర్మీడియట్ పరీక్షలు మూసివేసిన తర్వాత  అనుమతి లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలోనే ఇంటర్ బోర్డు హైకోర్టును కోరిన విషయం తెలిసిందే.  గుర్తింపు లేని నారాయణ, చైతన్య  కాలేజీలపై సామాజిక కార్యకర్త రాజేష్ దాఖలు చేసిన  ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు నిబంధనలను పాటించలేదని చర్యలు తీసుకోవాలని సూచించింది.

అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేని కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. గుర్తింపులేని కళాశాలలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ఇంటర్ బోర్డు. అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ లేని కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్టుగా  ఇంటర్ బోర్డు ప్రకటించింది.
 
 గతంలో పరీక్షలు ఉన్నందున  ఇప్పుడు కాలేజీలు మూసివేస్తే  దాని ప్రభావం విద్యార్ధులపై  పడుతోందని ఇంటర్ బోర్డు హైకోర్టుకు చెప్పింది. గుర్తింపు లేని కాలేజీల్లో  29,800 మంది విద్యార్థులు ఉన్నారని బోర్డు స్పష్టం చేసింది. అగ్నిమాపక శాఖ నుండి  అనుమతి లేని కాలేజీల్లో కూడ పరీక్ష కేంద్రాలు ఉన్న విషయాన్ని బోర్డు ప్రకటించింది. 

ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఈ కాలేజీలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని  ఇంటర్ బోర్డు హైకోర్టును అభ్యర్ధించింది. దీంతో తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు  తీసుకుంది. 


 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu