తెలంగాణలో తగ్గని కరోనా వ్యాప్తి: కొత్తగా 66 కేసులు, మొత్తం కేసులు 766

By telugu teamFirst Published Apr 17, 2020, 6:11 PM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా తెలం్గాణలో 43 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 743కు చేరుకుంది.

హైదరాబాద్:తెలంగాణ ఈ ఒక్క రోజే 66 కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరుకుంది. వీటిలో 562 యాక్టివ్ కేసులు. ఒక్క హైదరాబాదులోనే 427 కేసులు నమోదయ్యాయి. వీటిలో 286 యాక్టివ్ కేసులు. ఇప్పటి వరకు తెలంగాణలో 18 మంది కరోనా మరణాలు సంభవించాయి. 

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటీవల హైదరాబాదులోని కింగ్ కోఠీ ఆస్పత్రి వద్ద మరణించిన మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులను, వైద్యం చేసిన సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా నందిగామ మండలంలోని తాళ్లగుడా గ్రామంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా హైదరాబాదులోని పాతబస్తీలో ఓ డాక్టరుకు, ఓ నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న మహిళకు వారు చికిత్స చేశారు. 

పాతబస్తీలోని మహిళ కుటుంబ సభ్యులు 17 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మహిళతో కాంటాక్టులో ఉన్నవారినందరినీ క్వారంటైన్ కు తరలించారు. హైదరాబాదులో కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం పలు కంటైన్మెంట్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, హైదరాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న పలువురు ప్రొఫెసర్లకు, ఆరోగ్య సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణలో గురువారం సాయంత్రానికి 700 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 18 మంది మరణించారు.

click me!