పార్కింగ్ ఫీజు: థియేటర్లకు శుభవార్త, మల్టీప్లెక్స్‌లకు షాక్.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Jul 20, 2021, 7:36 PM IST
Highlights

సినీ నిర్మాతలు, తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ప్రారంభానికి అనుమతినిచ్చింది. సినిమా థియేటర్లను 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతించింది.

థియేటర్ యజమానులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే మల్టీప్లెక్స్, కమర్సియల్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అలాగే ఈ నెల 23 నుంచి థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించింది. 

ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ వెల్లడించింది. ఈ నెల 23 నుంచి సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణా అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు

Also Read:అంతా తూచ్‌ః సినీ జనాల ఆశలపై నీళ్లు.. థియేటర్ల ఓపెనింగ్‌ పై నో క్లారిటీ

అటు టాలీవుడ్ సినీ నిర్మాతలు, తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా థియేటర్లను 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.
 

click me!