పీఎఫ్‌ఐ కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశం.. అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజన్స్..

Published : Oct 15, 2022, 11:21 AM IST
పీఎఫ్‌ఐ కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశం.. అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజన్స్..

సారాంశం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) వ్యవహారాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం అయింది. పీఎఫ్‌ఐ కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) వ్యవహారాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం అయింది. పీఎఫ్‌ఐ కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టింది.  కేరళ, తమిళనాడులలో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని హెచ్చరించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు స‌దుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?