నేను వ్యక్తిగతంగా అవమానపడ్డాను.. టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. కేసీఆర్‌‌కు లేఖ..

By Sumanth Kanukula  |  First Published Oct 15, 2022, 10:06 AM IST

టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షునికి బూర నర్సయ్య గౌడ్ లేఖ రాశారు.


టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షునికి బూర నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. ఈ లేఖలో బూర నర్సయ్య గౌడ్ పలు అంశాలను ప్రస్తావించాడు. తాను పార్టీలో వ్యక్తిగతంగా అవమానపడ్డానని చెప్పారు. తనకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారని.. ఆత్మగౌరవ సభలకు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలు వివక్షతకు గురవుతున్నారని ఆరోపించారు.  

కేసీఆర్‌ అంటే అభిమానం అని.. తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతో ఇప్పటివరకు టీఆర్ఎస్ ఉన్నానని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. కానీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందన్నారు. అవకాశాలు రాకున్నా పర్వాలేదని.. కానీ అఅట్టడు వర్గాల సమస్యలను కనీసం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చే అవకాశమే లేనప్పుడు.. తాను టీఆర్ఎస్‌లో కొనసాడం అర్ధరహితం అని పేర్కొన్నారు. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని చెప్పారు. ఇక, బూర నర్సయ్య గౌడ్ త్వరలోనే బీజేపీ చేరే అవకాశం ఉంది. 

Latest Videos

ఇక, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవాలని బూర నర్సయ్య గౌడ్ ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఫలించలేదు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడం పట్ల అసంతృప్తితో ఉన్న బూర నర్సయ్య గౌడ్‌తో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం ఢిల్లీలో పలువురు బీజేపీ ముఖ్య నాయకులను కలిశారు. నేడు బూర నర్సయ్య గౌడ్.. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాలను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 

మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ.. బూర నర్సయ్య గౌడ్ వంటి సీనియర్ నేత టీఆర్ఎస్‌ను వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించగల కల్లుగీతకారుల సామాజికవర్గంకు చెందిన బూర నర్సయ్య గౌడ్.. బీజేపీలో చేరితే ఆ పార్టీ ప్రచారంలో మరింత జోష్‌ నింపుతుందని భావిస్తున్నారు.   

 

 

click me!