హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు..

By SumaBala BukkaFirst Published Oct 15, 2022, 11:15 AM IST
Highlights

హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక "ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్" (ఏఐపీహెచ్) అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరింది. అక్టోబర్ 14న సౌత్‌కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH) 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ ఓవరాల్ 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022'తో పాటు 'లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్' విభాగంలో మరొకటి గెలుచుకుంది. 

శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ అవార్డుకు ఎంపిక చేయబడిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ మాత్రమే కావడం విశేషం. ఈ కేటగిరీ అవార్డు మాత్రమే కాకుండా మొత్తం 6 కేటగిరీల్లో బెస్ట్ గా నిలిచి ఓవరాల్ 'వరల్డ్ గ్రీన్ సిటీ 2022' అవార్డును గెలుచుకోవడం తెలంగాణకే కాకుండా మొత్తం భారతదేశానికి గర్వకారణం. 

నేను వ్యక్తిగతంగా అవమానపడ్డాను.. టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. కేసీఆర్‌‌కు లేఖ..

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కెటి రామారావు దీనికి గానూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ బృందాన్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏ అండ్ యుడి అరవింద్ కుమార్‌ను అభినందించారు. నగరానికి ప్రతిష్టాత్మకమైన "ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్" అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణ, దేశ ఖ్యాతిని మరింత బలోపేతం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, పట్టణాభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ.. దేశానికి పచ్చని ఫలాలను అందజేస్తోందనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనమని ఆయన శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతర్జాతీయ అవార్డులకు భారతదేశం నుండి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వకారణమని ఆయన అన్నారు.

click me!