Peddapalli News: గోదావరిఖనిలో భార్యను హత్య చేసిన భర్త.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో..

Published : Apr 12, 2022, 10:49 AM IST
 Peddapalli News: గోదావరిఖనిలో భార్యను హత్య చేసిన భర్త.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో..

సారాంశం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. ఇంట్లోనే మృతదేహాన్ని వదిలి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో నంచి దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. ఇంట్లోనే మృతదేహాన్ని వదిలి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో నంచి దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. సుందరగిరి రాజేష్, ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన రక్షితలు కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే కొంతకాలంగా డబ్బు, బంగారం విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

రక్షిత బంగారాన్ని కొద్ది రోజుల క్రితం రాజేష్ కుదవ పెట్టాడు. అయితే సోదరి వివాహం ఉండడంతో బంగారం విడిపించాలని రక్షిత.. భర్త రాజే‌ష్‌ను అడిగింది. అతడు విడిపించకపోవడంతో పదే పదే అడగసాగింది. అయితే ఈ క్రమంలోనే రక్షితను హత్య చేసిన రాజేష్.. ఇంటికి తాళం వేసి బాబును తీసుకుని పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

రక్షితను రెండు రోజుల క్రితం హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ గిరి ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక, రక్షిత మరణవార్త తెలుసుకున్న ఆమె బంధువులు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu