ధర్మపురి అరవింద్‌కి నిరసన సెగ: ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసన

Published : Apr 12, 2022, 09:56 AM ISTUpdated : Apr 12, 2022, 10:44 AM IST
ధర్మపురి అరవింద్‌కి నిరసన సెగ: ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసన

సారాంశం

వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందు  రైతులు వడ్లు పోసి నిరసనకు దిగారు.

నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని Armoorలో నిజామాబాద్ ఎంపీ Dharmapuri Arvind  ఇంటి ఎదుట వడ్లు పోసి రైతులు మంగళవారం నాడు నిరసనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ TRS  ఆందోళనలు చేస్తుంది. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలను కేంద్రం, BJP  నేతలు ఖండిస్తున్నారు. ఇవాళ బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందు వడ్లు పోసి Farmers ఆందోళనలకు దిగారు. 

ఈ నెుల 4వ తేదీ నుండి 11వ తేదీ  వరకు టీఆర్ఎస్ పలు రకాల ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్  లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నిరసనకు దిగారు.ఈ నిరసనలో తెలంగాణ సీఎం KCR పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం కొనసాగుతుంది.  కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలోనిమ్ము నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. యాసంగిలో రైతులను వరి పంట పండించవద్దని తాము చెప్పామని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే రైతులు వరి పంట వేశారని టీఆర్ఎస్ చెబుతుంది. వరి పండిస్తే కేంద్రంతో చెప్పి తాము ధాన్యం కొనుగోలు చేయిస్తామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్