రాష్ట్రంలో కరోనా తీవ్రత.. త్వరలోనే కేసీఆర్ రివ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం: మహమూద్ అలీ

By Siva KodatiFirst Published Apr 28, 2021, 7:44 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనాను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ సాగుతోందని హోంమంత్రి తెలిపారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మహమూద్ అలీ వెల్లడించారు

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనాను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ సాగుతోందని హోంమంత్రి తెలిపారు.

బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మహమూద్ అలీ వెల్లడించారు. రాష్ట్రంలోని పరిస్ధితులపై త్వరలో సీఎం కేసీఆర్  సమీక్ష నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.

సమీక్ష అనంతరం లాక్‌డౌన్‌పై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి తేల్చిచెప్పారు. లాక్‌డౌన్ పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదని మహమూద్ అలీ వెల్లడించారు. లాక్‌డౌన్ విధించడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని హోంమంత్రి చెప్పారు.

Also Read:కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్: యాంటిజెన్ టెస్ట్‌లో నెగిటివ్, రేపు ఆర్టీపీసీఆర్‌ రిజల్ట్

రాష్ట్రంలో పరిస్ధితులు అదుపు తప్పడంతో ప్రభుత్వం కనీసం సమీక్షా సమావేశాలు జరపడం లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమూద్ అలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. సీఎంకు నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రేపు రానుంది.  

 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!