బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు

Published : Mar 09, 2022, 02:22 PM ISTUpdated : Mar 09, 2022, 02:31 PM IST
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయమై అసెంబ్లీ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ నెల 7వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.  

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి BJP ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై అసెంబ్లీ సెక్రటరీకి Telangana High Court  బుధవారం నాడు Notices జారీ చేసింది.

Telangana Assembly Budget sessions ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో  బీజేపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని సభ నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా బీజేపీ ఎమ్మెల్యేలను suspend చేశారు. 

 ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టులో Petition  దాఖలు చేశారు. ఈ విషయమై ఇవాళ హైకోర్టులో విచారణ  జరిగింది.  శాసనసభ వ్యవహరాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. అయితే ముందస్తు ప్నలాన్ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 7న శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు వ్యతిరేక నినాదాలు చేశారు. . 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లను ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించారు.  మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్ రావు సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా