కరోనా నివేదికపై అసంతృప్తి... కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

By Arun Kumar PFirst Published Apr 27, 2021, 5:42 PM IST
Highlights

రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

హైదరాబాద్: తెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై హైకోర్టు నివేదిక కోరగా ప్రభుత్వం సమర్పించింది. అయితే ఆ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక సరిగా లేదని... ఇందులో తెలియజేసిన వివరాలు నమ్మశక్యంగా లేవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోరా వ్యాప్తి, గణనీయంగా కేసుల పెరుగుదల, మరణాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి ఇంత తీవ్రంగా వున్నా, తాము ఆదేశించినా ఆర్టీపిసిఆర్ టెస్టుల సంఖ్యను ఎంతుకు పెంచడం లేదంటూ న్యాయస్థానం సీరియస్ అయ్యింది.  

మరోవైపు వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా కరోనాను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేస్తూ ఓ నివేదిక సమర్పించాలని ఎస్ఈసీని కోరింది. ఈ నెల 29లోగా ఎస్ఈసీ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

read more  తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కల్లోలం... తాజాగా కామారెడ్డి ఎస్సై మృతి

తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నాడు నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 1 నుండి 25వ తేదీ వరకు 23.56 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.  వీరిలో 4.39 మందికి ఆర్టీపీసీఆర్, 10.16 లక్షల ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్టుగా తెలిపింది. 

కరోనా పరీక్షలు ఎక్కువగా చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 1 నుండి 25 వ తేదీ వరకు 341 మంది కరోనాతో మరణించారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ 3.5 శాతంగా ఉందని ప్రకటించింది. కరోనా నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్ లో నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్ లు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొన్నామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మద్యం దుకాణాలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది.రాష్ట్రానికి  430 టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుండి ఆక్సిజన్ ను  చేరవేస్తున్నామన్నారు.  రెమిడెసివర్ పర్యవేక్షణ  కోసం నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించినట్టుగా ప్రభుత్వం వివరించింది. 
 

click me!